నాగన్న

మానవులు తప్పులు చేస్తారు. వారలా చెయ్యక తప్పదు. వారు నేర్చుకునే విధానమే అట్టిది – హారీ పామర్

జోకానువాదం – 47: విరక్తి

with 3 comments

జీవితంపై విసిగి, వేసారి, విరక్తిచెందిన నసీరుద్దీన్, కారులో కూర్చొని డ్రైవర్‌ను ఆదేశించాడు:
కొండ చివరన వేగంగా ముందుకు వెళ్ళు. నేను ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను.

Written by నాగన్న

May 30th, 2009 at 12:30 am

ధ్యానంతో మెదడు ధన్యం!

without comments

ధ్యానంధ్యానంతో మెదడు ధన్యం!
పరిమాణం పెరుగుతుంది
మనోవికాసం కలుగుతుంది
అమెరికా పరిశోధకుల వెల్లడి

న్యూయార్క్‌: కండలు పెరిగేందుకు బస్కీలు, కసరత్తులు, పౌష్టికాహారం చాలు.. మరి మెదడు వికసించి చురుగ్గా ఆలోచించాలంటే?.. మన చేతిలో పని కాదని గాభరా పడాల్సిన పనిలేదు! కాస్తంత తీరిక చేసుకుని ధ్యానం చేస్తే చాలని చెబుతున్నారు పరిశోధకులు. సాధన చేస్తే ఇది అంత కష్టం కాదని సెలవిస్తున్నారు. దీర్ఘకాలం పాటు ధ్యానం చేసే వారిలో మెదడులోని కొన్ని భాగాలు విశాలంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాలిఫోర్నియా లాస్‌ ఏంజెలస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దీనిపై అధ్యయనం నిర్వహించారు. ధ్యానం చేసే వారి మెదడును ‘ఎమ్మారై’ స్కానింగ్‌ తీయటం ద్వారా ఫలితాలను నిర్ధరించారు. వీరిలో హిప్పోక్యాంపస్‌, కోర్టెక్స్‌ ముందుభాగం, థాలమస్‌, గైరస్‌ లాంటి భావోద్వేగాలను నియంత్రించే భాగాలు పెద్దవిగా ఉన్నట్లు తేలింది. ‘ఏకాగ్రతతో ధ్యానం చేసే వారికి సానుకూల దృక్పథం అలవడుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు’ అని సర్వేలో పాల్గొన్న ఎలీన్‌ లూడెర్స్‌ తెలిపారు. విపాసన, సమత, జజీన్‌ ధ్యాన విధానాలను అనుసరించే వారిపై అధ్యయనం నిర్వహించారు. రోజూ సుమారు 10 నుంచి 90 నిముషాల పాటు తాము ధ్యానం చేస్తున్నట్లు ఇందులో పాల్గొన్న వారు చెప్పారు. ఏకాగ్రత వల్ల నిశ్చలంగా ధ్యానం చేయగలుగుతున్నట్లు సగం మందికిపైగా తెలిపారు.

(కృతజ్ఞతలు: ఈనాడు పత్రిక)

Written by నాగన్న

May 17th, 2009 at 4:32 pm

అమ్మ

with 2 comments

మా అమ్మ నాకు ఆది మరియు అతి ముఖ్యమైన గురువు. నా మీద మిగతా ప్రపంచానికన్నా మా అమ్మ ప్రభావం ఎక్కువ. ఇది బయటకు చెప్పడానికి చాలా ఏళ్ళు జంకాను, ఎటువంటి పేరు తెస్తానో అని, కానీ నేడు నాకు భయం లేదు, వానరుడు నరునిగా రూపాంతరం చెందాడు  అని నమ్మకం కలిగింది… ప్రస్తుతానికి… :)

మా అమ్మ నన్ను ఎత్తుకొని వెళ్ళిన మొట్టమొదటి సినిమా ‘జీవితం’ అట, నాతో చాలా సార్లు చెప్పేది.  చెప్పినప్పుడల్లా జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించిన ఆలోచనలు మెదిలేవి, ఇప్పటికీ అవి  బాగా గుర్తుకున్నాయి.  చిన్నప్పుడు నా అల్లరి చాలా బాగా ఉండేదట, ముప్పై ఏళ్ళు దాటినా వాటిని కథల్లా చెబుతూ ఉంటారు. ఏవైనా చేయగూడని తప్పులు చేస్తే మాత్రం అమ్మ చేతిలో దండన కఠినంగా ఉండేది.

నా అల్లరి తట్టుకోలేక మూడేళ్ళ వయసులోనే  పాఠశాలలో చేర్పించింది (ములుగు, ఓరుగల్లు) మొట్టమొదటి తెలుగు అక్షరాలు తానే దిద్దించింది. ఆ తరువాత ఎన్నేళ్ళు ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా తన సంకల్పబలం వల్ల నాలో తెలుగు భాష, అక్షరాలు ఇంకా జీవించే ఉన్నాయి.

దండన ఫలితమో, శిక్షణో ఆ తరువాతి కాలంలో సౌమ్యునిలా మారి, ఎంత సేపూ పుస్తక ప్రపంచంలో (చందమామ, షాడో వగైరా నవలలు) గడిపే వాడిని, పుస్తక పఠనం అన్న అలవాటు కూడా తన నుండే అబ్బింది. తాను పాటించిన ఆదర్శాలు, బోధించిన (ఆధ్యాత్మిక) విషయాలు తరువాతి జీవితంలో నాకు మార్గదర్శకాలు అయ్యాయి…

వెరసి ఈ బ్లాగు, నా రాతలు (మంచివి), నా బతుకు (లోకానికి చెడు చేయని పనులు) అన్నీ మొట్టమొదట తనకే అంకితం.

HAPPY MOTHER’S DAY.

Written by నాగన్న

May 10th, 2009 at 11:35 pm

follow me on Twitter